
హైదరాబాద్ సిటీ, వెలుగు: సోమాజిగూడలోని హెచ్ఎస్ఈఎల్(హైదరాబాద్ సెక్యూరిటీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్) భూమిని డెవలప్ మెంట్ చేసేందుకు తమతో 2017లో ఒప్పందం చేసుకున్న సంగతి వాస్తవమేనని, వారి నుంచి తీసుకున్న 17 వేల 700 చదరపు గజాల స్థలానికి సంబంధించి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన ప్లేస్ ఇచ్చేశామని హెచ్ఎస్ఈఎల్ మాజీ చైర్మన్ శివకుమార్ స్పష్టం చేశారు.
సోమాజిగూడలోని ప్రణవ ప్రాంగణంలో గురువారం ప్రణవ్ నిర్మాణ సంస్థ(బూరుగు ఇన్ఫ్రా డెవలప్ మెంట్) ప్రతినిధి రవితో కలిసి మాట్లాడారు. గతంలో ఎవరూ డెవలప్ మెంట్ చేసేందుకు ముందుకు రాలేదని, ఇపుడు డెవలప్ మెంట్ చేశాక ఆందోళనలు చేయడం బ్లాక్ మెయిల్ కోసమేనని అన్నారు. ఒప్పందం ప్రకారం హెచ్ ఎస్ ఈ ఎల్ కంపెనీకి 50 శాతం అప్పగించిన తర్వాత పలువురు షేర్ హోల్డర్స్ తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు.