వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై మాజీ సీఎం జగన్ ట్వీట్ 

వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై మాజీ సీఎం జగన్ ట్వీట్ 

అమరావతి: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో  రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని  ట్వీట్ చేశారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చి వేయించారని  అన్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చంద్రబాబు చేశారన్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైందన్నారు. 

ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రాబాదు.. ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారన్నారు. ఈ బెదిరింపులకు , ఈకక్ష సాధించిపు చర్యలకు వైసీపీ తలొగ్గది లేదన్నారు. వెన్ను చూపేది అంతకన్నా లేదని అన్నారు. ప్రజల తరపున, ప్రజల కోసం , ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తామన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించా లని జగన్ ట్వీట్ ద్వారా కోరారు.