కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగింది

కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగింది

హైదరాబాద్: అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ వంటి వ్యక్తులు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. అనంతరం కుమారస్వామి మాట్లాడారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని స్థాపించాలని కోరారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రత్యమ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కుమారస్వామి అన్నారు. అందుకోసం కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపిస్తే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని, కాంగ్రెస్ నాయకత్వంపై దేశ ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.