టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse).. ప్రస్తుతం టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా ఆమె ఖాతాలో పడలేదు.
వరుస సినిమాలు.. ఫలితం మాత్రం శూన్యం
మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముంబై బ్యూటీకి తొలి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత చేసిన ‘కింగ్‌డమ్’, ‘ఆంధ్రా కింగ్’ చిత్రాలు కూడా నిరాశపరిచాయి. ఇలా వరుసగా మూడు ఫ్లాప్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేసింది.
తమిళంలో ‘కాంత’ చిత్రంతో అడుగుపెట్టినా అక్కడా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదు.
‘లెనిన్’పై భారీ అంచనాలు
ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఒకే ఒక్క ప్రాజెక్ట్ అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ సినిమాపై మంచి హైప్‌ను సృష్టించాయి. అఖిల్‌కు కూడా ఇప్పటివరకు భారీ కమర్షియల్ హిట్ దక్కలేదు. ఈ క్రమంలో ‘లెనిన్’ ఇద్దరికీ కీలక చిత్రంగా మారింది. సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే ఇద్దరి కెరీర్‌కు మలుపు తిరిగే అవకాశం ఉంది.
భాగ్యశ్రీకి ‘మేక్ ఆర్ బ్రేక్’ మూవీ?
సినీ వర్గాల అంచనాల ప్రకారం, ‘లెనిన్’ విజయం భాగ్యశ్రీ కెరీర్‌కు కీలకం. ఈ సినిమా హిట్ అయితేనే ఆమెకు మరిన్ని పెద్ద ప్రాజెక్టులు దక్కే అవకాశాలు ఉన్నాయని టాక్. మరి ఈసారి అయినా సక్సెస్ భాగ్యశ్రీని వరించుతుందా? లేదా అన్నది చూడాలి.
ప్రతిష్టాత్మక నిర్మాణం
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు, ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంత కథాంశంతో దర్శకుడు మురళీ కే కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్నారు.
ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా ఉండనున్నాయి. సమ్మర్‌లో (మే1న) విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
