ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్లోని 5వ వార్డు మాజీ కౌన్సిలర్ పరిమి లత, ఆమె భర్త సురేశ్ ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు ధోనికేని దయానంద్ తెలిపారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కౌన్సిలర్ దంపతులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు గుర్తించామని.. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంకం రాజేందర్, నాయకులు కావలి సంతోష్, యూసుఫ్ ఖాన్, వెంకటప్పయ్య, శంకర్, మాధవ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
