డకౌట్ అవ్వడం బాధాకరం.. సూర్యకు అండగా సునీల్ గవాస్కర్

డకౌట్ అవ్వడం బాధాకరం.. సూర్యకు అండగా సునీల్ గవాస్కర్

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేలో మూడు సార్లు డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్కు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. ప్రతీ ఆటగాడి కెరీర్లో వైఫల్యం అనేది కామన్ అని..వాటి గురించి ఆలోచించకుండా  ఐపీఎల్లో సత్తా చాటాలని సూచించాడు. ఐపీఎల్లో రాణించడం వల్ల వన్డే వరల్డ్ కప్లో చోటు దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

డకౌట్ అవ్వడం బాధాకరం..

సూర్యకుమార్ యాదవ్ ఆసీస్ తో జరిగిన మూడు వన్డేల్లో  డకౌట్ అవడం బాధాకరమని సునీల్ గవాస్కర్ అన్నాడు.  ఏ ఆటగాడైనా తన కెరీర్లో ఇలా డకౌట్ అవ్వడం సర్వసాధారణమని చెప్పాడు. అయితే వన్డే సిరీస్లో విఫలమయ్యానని తరచూ ఆలోచించకూడదన్నాడు. తన వైఫల్యం గురించి  సూర్య మర్చిపోవడం మంచిదని సలహా ఇచ్చాడు. ఐపీఎల్పై ఫోకస్ పెట్టాలని..ఈ సీజన్లో ఎక్కువ పరుగులు చేసి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని సూచించాడు. 

వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకో..

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడనుందని..ఈ విషయాన్ని సూర్యకుమార్ దృష్టిలో పెట్టుకోవాలని గవాస్కర్ సూచించాడు. ఐపీఎల్, వెస్టిండీస్ సిరీస్లో రాణిస్తేనే సూర్యకుమార్ వన్డే వరల్డ్ కప్లో చోటు దక్కించుకుంటాడని చెప్పాడు.

మూడు వన్డేల్లో డకౌట్..

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఒకే తరహాలో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆఖరి వన్డేలో స్పిన్నర్ అష్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.