ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ సంతోషానికి అవధుల్లేవ్..

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ సంతోషానికి అవధుల్లేవ్..

సాధారణంగా క్రికెట్లో క్యాచ్ పడితే మైదానంలో ప్లేయర్లు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్లేయర్లు కొట్టిన బంతి ఫ్యాన్స్ చేతుల్లో పడితే వారు సంబరాలు చేసుకుంటారు. కానీ క్యాచ్ పట్టిన ఓ మాజీ క్రికెటర్ మాత్రం..మామూలుగా సంతోషం వ్యక్తం చేయలేదు. క్యాచ్ పట్టిన తర్వాత పరుగులు పెడుతూ..సంబరాలు చేసుకున్నాడు. ఈ సంఘటన  టీ10యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటలీ, స్విట్జర్లాండ్  మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. 

డైవ్ చేసి క్యాచ్ పట్టాడు..
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్..ఓ మ్యాచ్ టైంలో ప్రేక్షకులు కూర్చునే ప్లేస్‌లో నిల్చుని మ్యాచ్ చూస్తున్నాడు. అయితే అదే సమయంలో  బ్యాట్స్మన్ సిక్స్ కొట్టాడు. ఆ బంతి సరిగ్గా స్వాన్ కు దగ్గర్లో పడబోయింది. దీన్ని గమనించిన స్వాన్...అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. అంతే స్వాన్ ఆనందానికి అవధుల్లేవు. క్యాచ్ అందుకున్నా..బంతిని పట్టుకుని పరుగులు తీశాడు. క్యాచ్ పట్టిన బంతిని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈవీడియో వైరల్ అయింది. 

ఇటలీ విజయం
ఈ మ్యాచ్‌లో ఇటలీ 66 పరుగుల తేడాతో  విజయం సాధించింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన ఇటలీ 10 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన స్విట్జర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి కేవలం 102 పరుగులు మాత్రమే చేసింది. 

2013లో రిటైర్మెంట్..
ఇంగ్లాండ్ తరపున గ్రేమ్ స్వాన్ 60 టెస్టులు, 79 వన్డేలు, 39 టీ20 ఆడాడు. స్వతాహాగా స్పిన్నర్ అయిన స్వాన్.. టెస్టుల్లో 255 వికెట్లు, వన్డేల్లో 104 వికెట్లు, టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు.  2013లోనే  అంతర్జాతీయ క్రికెట్కు గ్రేమ్ స్వాన్  రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా తనదైన విశ్లేషణలతో ఆకట్టుకుంటున్నాడు.