
తెలంగాణ మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ హైదరాబాద్ కు రానున్నారు. ఏప్రిల్ 5 ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చి ఏప్రిల్ 12 వరకు ఇక్కడే పర్యటించనున్నారు. ఏప్రిల్ 7న నరసింహన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకోనున్నారు.
ఆ మరుసటి రోజున అంటే ఏప్రిల్ 8 న ముచ్చింతల్‌లో సమతామూర్తి, రామానుజాచార్యుల విగ్రహాలను దర్శించుకోనున్నారు. ఏప్రిల్ 12 తిరిగి చెన్నైకి వెళ్లిపోనున్నారు. హైదరాబాద్ లో ఉన్నని రోజులు ఆయన ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనున్నారు.
కాగా నరసింహన్ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. 24 జూలై 2019 - 7 సెప్టెంబర్ 2019 మధ్య ఆయన తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ పనిచేశారు.