రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్..?

రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్..?
  • ఆప్ లేదా బీఎస్పీలోకి వెళ్లడంపై సంప్రదింపులు 

హైదరాబాద్, వెలుగు: మాజీ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి రాజకీయాల్లో వెళ్లనున్నారు. ఏ పార్టీలోకి ఎంట్రీ అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తన సన్నిహితులతో ఆయన చర్చిస్తున్నారు. ప్రధానంగా బీఎస్పీ లేదా ఆప్ లోకి వెళ్తే బెటర్ అనే సూచనలు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో బీఎస్పీ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడంతో, ఆప్​లోకి వెళ్తేనే గుర్తింపుతో పాటు భవిష్యత్​ ఉండే అవకాశం ఉందని మెజారిటీ సన్నిహితులు సూచిస్తున్నట్లు తెలిసింది. మురళి కూడా సోషల్ డెమోక్రటిక్ ఫోరం ద్వారా విద్య, వైద్యం వంటి అంశాలపై పోరాటం చేస్తున్నారు. ఫోరం ద్వారా కాకుండా పార్టీ ద్వారానే పోరాటాలు నిర్వహించాలని పలువురు ఆయనకు సూచించడంతో రాజకీయాల్లోకి వెళ్లాలని మురళి నిర్ణయించుకున్నారు.