తల్లి, భార్యను చంపిన మాజీ షాట్‌పుట్టర్

తల్లి, భార్యను చంపిన మాజీ షాట్‌పుట్టర్

పెన్సిల్వేనియా: తల్లి, భార్యను చంపినందుకు ఇండియాకు చెందిన ఇక్బాల్ సింగ్ బోపరాయ్‌ అనే మాజీ షాట్‌పుట్‌ ప్లేయర్‌‌ను అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. 63 ఏళ్ల ఇక్బాల్ 1983లో కువైట్‌లో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. భార్యతోపాటు తల్లిని చంపిన నేరం కింద ఇక్బాల్‌ను పెన్సిల్వేనియాలోని న్యూటౌన్ స్క్వేర్‌‌లో పోలీసులు ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు. తాను ఇంటికి వచ్చే లోపే వారిద్దర్నీ నాన్న చంపేశాడని ఇక్బాల్ కుమారుడు చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇక్బాల్ తల్లి నసీబ్ కౌర్, భార్య జస్పాల్ కౌర్ మృత దేహాలను పోలీసులు గుర్తించారు.