బంగ్లాదేశ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్

బంగ్లాదేశ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ బంగ్లాదేశ్ టీమ్ కోచ్గా  ఎంపికయ్యాడు. యూఏఈలో జరిగే ఆసియాకప్తో పాటు..ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జాతీయ జట్టు కోచ్గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్ ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించింది.  ఈమేరకు బంగ్లా క్రికెట్ బోర్డు ప్రకటించింది. 

టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా నియామకం..
భారత మాజీ ఆల్ రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను బంగ్లా టీమ్ కోచ్ గా నియమించినట్లు బీసీబీ డైరెక్టర్ ధృవీకరించారు. టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని తాము శ్రీధరన్ శ్రీరామ్ ను కోచ్ గా ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఆసియాకప్ కు టైం తక్కువగా ఉన్నా..తాము టీ20 వరల్డ్ కప్ లో మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో కొత్త కోచ్ ను నియమించినట్లు చెప్పుకొచ్చారు. 

ఆసీస్కు కోచ్గా బాధ్యతలు.
శ్రీధరన్  శ్రీరామ్ ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా, స్పిన్ బౌలింగ్ కోచ్  కూడా పనిచేశాడు. ఆస్ట్రేలియన్ మాజీ కోచ్ డారెన్ లీమాన్ ఆధ్వర్యంలో  శ్రీరామ్‌ 2016లో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం ఆర్సీబీ టీమ్‌ సపోర్ట్ స్టాఫ్‌లో శ్రీరామ్‌ ఉన్నాడు. ఆర్సీబీపై  పూర్తిస్థాయిలో దృష్టిసారించడానికి ఈ మధ్యే ఆస్ట్రేలియా స్పిన్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశాడు. 

భారత్ తరపున.
శ్రీధరన్ శ్రీరామ్ భారత్ తరపున 2000 నుంచి 2004 వరకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. సౌతాఫ్రికాతో నాగ్ పూర్ లో వన్డేల ద్వారా అరంగేట్రం చేశాడు. మొత్తం 8 వన్డేలు ఆడిన శ్రీరామ్..81 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 133 మ్యాచులు ఆడి..9539 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 36 అర్థసెంచరీలున్నాయి. లిస్ట్ A క్రికెట్ లో 147 మ్యాచులు ఆడిన శ్రీరామ్..4169 పరుగులు కొట్టాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలున్నాయి. 15 టీ20ల్లో 233 రన్స్ సాధించాడు.