సూపర్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ నిబంధన గేమ్ ఛేంజర్

సూపర్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ నిబంధన గేమ్ ఛేంజర్

సూపర్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ నిబంధన గేమ్ ఛేంజర్ అని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నాడు. ఈ నూతన రూల్ తో ఆట స్వరూపమే మారిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొదట ఈ నిబంధనను టీ20ల్లో అమలు చేయాలని బీసీసీఐకి సూచించాడు. 

'లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్లో నిబంధన అమలు..
తాజాగా జరుగుతున్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్ 2022 లో సూపర్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ నిబంధన నిబంధనను అమలు చేస్తున్నారు.  దీని  ప్రకారం తుది జట్టులో  లేని ఓ ప్లేయర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్  తర్వాత మరో ప్లేయర్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయవచ్చు. కానీ మ్యాచ్‌కు ముందే సూపర్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ను ప్రకటించాల్సి ఉంటుంది. ఇండియా మహారాజాస్‌, టీమ్‌ వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన స్పెషల్‌ బెనిఫిట్‌ మ్యాచ్‌లోనే  సూపర్‌ సబిస్టిట్యూట్‌ రూల్ను తీసుకొచ్చారు. ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్‌ తర్వాత రెండు జట్లు సూపర్‌ సబిస్టిట్యూట్‌ ప్లేయర్‌ను బరిలోకి దించారు. ఇండియా మహరాజస్ తరఫున అశోక్ దిండా సూపర్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్గా ఆడాడు. 

ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉపయోగించే ఛాన్స్..?
సూపర్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ నిబంధన  గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. క్రికెట్ ప్రతీ ఏడాది అభివృద్ధి చెందుతోందని..తాజా రూల్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌లో అమలయ్యే ఛాన్సుందన్నాడు. టీ20 ఫార్మాట్ అనేది అభివృద్ధి చెందుతున్న ఫార్మాట్ అని..లెజెండ్స్ లీగ్, ఐపీఎల్, బిగ్ బాష్ లాంటి లీగ్లలో ..సొంత నియమాలు రూపొందించుకోవచ్చన్నాడు. 

బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్..
సూపర్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ లాంటి నిబంధననే బీసీసీఐ కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఈ రూల్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ఈ నిబంధన ప్రకారం..తుది జట్టులో లేని ఓ క్రికెటర్ను మ్యాచ్ జరుగుతుండగా 14 ఓవర్ల లోపు మరో ఆటగాడికి రిప్లేస్‌మెంట్‌ చేయవచ్చు. ఈ ప్లేయర్ బ్యాటింగ్‌, బౌలింగ్ కూడా చేయవచ్చు. అయితే రిప్లేస్ మెంట్‌గా జట్టును వీడిన ప్లేయర్ మాత్రం మళ్లీ ఆ మ్యాచ్లో ఆడేందుకు వీళ్లేదు. అయితే ఫోర్త్ అంపైర్ లేదా..ఫీల్డ్ అంపైర్‌కు సమాచారమివ్వాలి. న్యూ రూల్ కారణంగా మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండనుంది.  గాయం కారణంగా ఎవరైనా ఆడకపోతే..ఈ నిబంధన ఉపయోగపడనుంది.