యుద్ధంలో పాల్గొన్న ఇజ్రాయెల్​ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్​

యుద్ధంలో పాల్గొన్న  ఇజ్రాయెల్​ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్​

టెల్​అవీవ్: పాలస్తీనా మిలిటెంట్​ సంస్థ హమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుద్ధ రంగంలోకి దిగారు. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ఇజ్రాయెల్​లో నిర్ణీత కాలంపాటు డిఫెన్స్​సర్వీస్​లో పనిచేయడం తప్పనిసరి. గతంలో డిఫెన్స్​సర్వీస్​లో పనిచేసిన నెఫ్తాలీ బెన్నెట్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీలో చేరి హమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైనికులను కలిశారు. వారితో కరచాలనం చేసి మిలిటెంట్లపై పోరాటానికి సిద్ధమయ్యారు. 

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి.  కాగా ఈ యుద్ధంలో ఇరువైపులా కనీసం1200 మంది మరణించినట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్ ​ప్రధాని బెంజమిన్  నెతన్యాహు హమాస్ దాడుల నుంచి తప్పించుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గాజా పౌరులను కోరాడు. హమాస్ గ్రూప్ మాత్రం తన దాడికి ‘‘ఆపరేషన్ అల్- అక్సా ఫ్లడ్’’ అని ట్యాగ్​లైన్ ​తగిలించింది. 

వెస్ట్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రెసిస్టెన్స్ ఫైటర్స్​తో పాటు అరబ్, ఇస్లామిక్ దేశాలను కూడా యుద్ధంలో చేరాలని పిలుపునిచ్చింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ మాట్లాడుతూ.. తన గ్రూప్ గొప్ప విజయం అంచున ఉన్నదన్నారు. కాగా అమెరికా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్  క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఒక బ్యాచ్ యుద్ధనౌకలను తూర్పు మధ్యధరా ప్రాంతానికి పంపింది. మరిన్ని వనరులు సమకూర్చనున్నట్లు యూఎస్​ డిఫెన్స్​సెక్రటరీ చెప్పారు.

ఇంటెలిజెన్స్​ వైఫల్యం ఉంది: మాజీ ప్రధాని
ఇజ్రాయెల్ సిటీలపై మరోసారి దాడి చేసే అవకాశాన్ని హమాస్​కు ఇవ్వొద్దని ఆ దేశ మాజీ ప్రధాని యైర్ ​లిపిడ్​ అన్నారు. మహిళలు, పిల్లలను ఊచకోత కోసే అవకాశం వారికి ఇంకెప్పుడూ రాకుండా చూసుకోవాలన్నారు. ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగడం వెనక  ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందని అన్నారు.