ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేకనే.. 

ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేకనే.. 
  • బీజేపీకి ఆదరణను జీర్ణించుకోలేక దాడులకు
  • మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కారుపై జరిగిన దాడిని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు.  ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేకపోవడం వల్ల చేస్తున్న చర్యలని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక దాడులకు దిగడం హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ  ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.