
మీ అరెస్టులకు, కేసులకు భయపడే చిన్న వ్యక్తిని కాదన్నారు మాజీ మంత్రి ఈటల. నమస్తే తెలంగాణ పేపర్ కు తన పౌల్ట్రీ ఫామ్ కుదువ పెట్టి జాగ ఇచ్చానన్నారు. సీఎం కేసీఆర్ తో తాను 19ఏళ్లు కలిసి పనిచేశానన్నారు.2008 లో ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పథకం ప్రకారమే తనపై భూ కబ్జా ఆరోపణలు చేశారన్నారు. పార్టీకి,ప్రభుత్వానికి, కేసీఆర్ కు మచ్చ తెచ్చే పని ఏనాడు చేయలేదన్నారు. కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు తనపై శక్తినంతా ప్రయోగించారన్నారు. కేసీఆర్ తన ఫామ్ హౌజ్ కు అసైన్డ్ భూముల నుంచి రోడ్లు వేయాలేదా అని ప్రశ్నించారు.
తనపై విజిలెన్స్,ఏసీబీ ,రెవెన్యూ శాఖలను ప్రయోగించారని..కేసీఆర్ స్థాయికి ఇవి తగని పనులన్నారు. కేసీఆర్ తో కలిసి ఉన్నప్పటి నుంచి సింగిల్ పైసా వ్యాపారం కూడా చేయలేదన్నారు. అధికారంలో ఏది పడితే అది చేయడం సరికాదన్నారు. నీ అధికారులకు వావి వరసలు కూడా తెలియడం లేదన్నారు. జమున హ్యాచరీస్ ఛైర్మన్ తాను కాదని..తనకు సంబంధమే లేదన్నారు. మీరు చెబితే ఏ కలెక్టర్ అయినా మీరు చెప్పినట్టుగానే రిపోర్టే ఇస్తారన్నారు. మీ కలెక్టర్ రిపోర్ట్ అఫీషియల్ గా తనకు అందలేదన్నారు. కనీసం నా వివరణ కూడా తీసుకోలేదన్నారు. లీగల్ గా ఏది చేయాలో అది చేస్తానన్నారు. కోర్టుకు వెళ్తానని...తప్పుచేస్తే ఏ శిక్షకైనా రెడీ అన్నారు.