పంచాయతీలకు నిధులు విడుదల చేయండి : హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

పంచాయతీలకు నిధులు విడుదల చేయండి : హరీశ్‌‌‌‌‌‌‌‌రావు
  • డిప్యూటీ సీఎం భట్టికి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు లేఖ

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో గ్రామాభివృద్ధి నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు.

ఈ మేరకు గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు బహిరంగ లేఖ రాశారు. నిధులు లేకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందని, చెత్త సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ నిలిపోయిందని లేఖలో పేర్కొన్నారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.