మా పార్టీలోకి 12 మంది వస్తే..10 మంది ఓడిపోయిండ్రు : హరీశ్ రావు

మా పార్టీలోకి 12 మంది వస్తే..10 మంది ఓడిపోయిండ్రు : హరీశ్ రావు

ఢిల్లీ:  పార్టీ ఫిరయింపుల వల్ల ఏ పార్టీకి లాభం ఉండదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. గతంలో తమ  పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు చేరారని, వారిలో పది మంది ఓడిపోయారని అన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తోందని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్నందున తాము ఆపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.  ‘ఫిరాయింపుల పై హైకోర్టులో విచారణ లేట్ అవుతుంది కాబట్టి సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తం. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలనేది పార్టీ అధినేత నిర్ణయం. రేవంత్ రెడ్డి అక్కడక్కడ నన్ను మెచ్చుకొని.. మా ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు.

రాష్ట్రంలో ప్రజలు గత ప్రభుత్వం తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి కి ఇంకా అడ్మినిస్ట్రేషన్ పై పట్టు రాలేదు. రాష్ట్రం లో రెండు నెలలుగా పెన్షన్ లు రావడం లేదు. గ్రామ పంచాయతీ లో సిబ్బందికి జీతాలు రావడం లేదు. రైతు బంధు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ సమస్య స్టార్ట్ అయింది. మళ్ళీ ఇన్వెర్టర్లు కొంటున్నారు.’ అని హరీశ్ రావు అన్నారు.