బీజేపీకి మాజీమంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

V6 Velugu Posted on Jul 27, 2021

  • త్వరలోనే టీఆర్ఎస్​లో చేరతా: పెద్దిరెడ్డి
     

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు  పంపారు. మారిన రాజకీయ పరిస్థితులతో  బీజేపీలో కొనసాగడానికి తన మనసు అంగీకరించడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు   తెలిపారు. 

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఆహ్వానం వచ్చింది..
టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఆ పార్టీలో ఎప్పుడు చేరాలనే దానిపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ ఎవరికి టికెటిస్తే, వాళ్లకు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు బీజేపీపై ఎలాంటి అసంతృప్తి లేదని, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల వల్లే బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరేటప్పుడు తనను, కార్యకర్తలను సంప్రదిస్తే బాగుండేదని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Tagged Bjp, TRS, Telangana, Huzurabad, former minister Peddireddy

Latest Videos

Subscribe Now

More News