అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ చెప్పేవన్నీ అవాస్తవాలే: మాజీ మంత్రి హరీష్రావు

అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ చెప్పేవన్నీ అవాస్తవాలే: మాజీ మంత్రి హరీష్రావు
  • కేఆర్ఎంబీపై తీర్మానం ఘనత బీఆర్ఎస్దే: 
  • చలో నల్లగొండ పిలుపుతోనే సర్కారు కదిలింది
  • పత్రికల్లో వార్తలు వచ్చినా ఖండించలేదెందుకు
  • రాహుల్ బొజ్జా లేఖల్లోనే సమాధానాలున్నాయ్  
  • మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సభలో అన్నీ అవాస్తవాలే చెప్పారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. సర్కారు కేఆర్ఎంబీపై చేసుకున్న ఒప్పందాలను నిరసిస్తూ.. తాము నల్లగొండలో సభకు  ఏర్పాటు చేస్తున్న తరుణంలో అసెంబ్లీలో బిల్లు పెట్టడం శుభపరిణామమన్నారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఘనవిజయమని చెప్పారు. ఈ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. 

పదేండ్ల కేసీఆర్ పాలనలో  ఎన్నడూ ప్రాజెక్టులను అప్పగించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంతకాలు చేసి వచ్చిందని చెప్పారు. కృష్ణా జలాలు వాస్తవాలు అనే పుస్తకంలో అన్నీ అవాస్తవాలే రాశారని, అందులోనే సమాధానాలున్నాయన్నారు. ఇరిగేషన్ సెక్రరీ రాహుల్ బొజ్జా రాసిన లేఖలను కోట్ చేస్తూ చదివి వినిపించే ప్రయత్నం చేశారు. నీటి వాటాల పంపకాలపై కేంద్రానికి ఇప్పటి వరకు 27 లేఖలు రాసినట్టు హరీశ్ రావు చెప్పారు. 

ఏక పక్షంగా అవకాశం ఇవ్వడం బాధాకరం. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని తీర్మానించడం బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం, నల్లగొండలో సభ పెట్టినం కనుకనే తీర్మానం పెట్టారని మేం భావిస్తున్నం..రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన మాటలను రికార్డులను తొలగించాలి.. రికార్డుల నుంచి తొలగించాలి. అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.  

పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలేదు..ఇప్పుడు మీరు సంతకం పెట్టి వచ్చిండ్రు..తీర్మానం గురించి మాట్లాడే ముందు. ప్రాజెక్టులు అప్పగించ బోమనే విషయాన్ని తీర్మానం చేయడం శుభపరిణామం..కృష్ణ వాస్తవాలు అనే పుస్తకంలో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. 

ప్రస్తుత ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా లెటర్ లోని అంశాలను హరీశ్ రావు ఎత్తి చూపారు. నీటి వాటాల పంపకాలపై కేంద్రానికి 27 ఉత్తరాలు  రాశాం.. 512–299 టీఎంసీలకు ఒప్పుకున్నారు.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ.. అని ఎట్ల అంటరు.. ఇది గత సంవత్సరం అడిగిండ్రు. అని హరీష్ రావు అన్నారు.