కోమటిరెడ్డిపై చిరుమర్తి వ్యాఖ్యలు సరికావు : వేముల వీరేశం

కోమటిరెడ్డిపై చిరుమర్తి వ్యాఖ్యలు సరికావు : వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు: కోమటిరెడ్డి బ్రదర్స్‌‌పై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలు సరికావని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే చిరుమర్తికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని, వాళ్లు లేకుండా ఆయనకు రాజకీయ జీవితం ఎక్కడిదని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులపై అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేయడం ఏంటని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌‌తో పాటు శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ విద్యాసాగర్, నకిరేకల్ ఎంపీపీ  శ్రీదేవి గంగాధర్ రావుపైనా చిరుమర్తి అసత్య ఆరోపణ చేస్తున్నారని ధ్వజమెత్తారు.   కాంగ్రెస్‌‌కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థుల్లో భయం మొదలైందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు ఇవ్వాలని కోరారు.