ఈటల రాజేందర్ కు సపోర్ట్ చేస్తా

ఈటల రాజేందర్ కు సపోర్ట్ చేస్తా

హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు సపోర్ట్ చేస్తామన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయంలో చెరుకు సుధాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం, ఈటల మధ్య జరిగేది పార్టీల కొట్లాట కాదన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే విధంగా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు చెరుకు సుధాకర్. ఈటల రాజేందర్ ను ఉపఎన్నికల్లో గెలవకుండా చేసే కుట్రలను సహించేది లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారునిగా ఈటల రాజేందర్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు నేతలు.