ప్రగతి భవన్‌ పాలనను తరిమికొట్టాలి

ప్రగతి భవన్‌ పాలనను తరిమికొట్టాలి

కాం గ్రెస్‌ నేత రాథోడ్‌ రమేశ్‌ నిర్మల్‍, వెలుగు: ప్రగతి భవన్‍ పాలనను ప్రజలు తరిమికొట్టా లని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ అన్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆయన.. ఆదివారం కడెం మండలంలో ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం అయిందన్నారు.ప్రభుత్వానికి ఐదేళ్లు పాలించాలని ప్రజలు కోరితే.. పాలన చేతకాక నాలుగున్నరేళ్లకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లా రన్నారు.