బంజారాల సమస్యలను పరిష్కరించండి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్

బంజారాల సమస్యలను పరిష్కరించండి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, బంజారా భారత్ ఆల్ ఇండియా మహా సేవా సంఘ్ వ్యవ‌‌‌‌‌‌‌‌స్థాప‌‌‌‌‌‌‌‌కుడు ర‌‌‌‌‌‌‌‌వీంద్ర నాయ‌‌‌‌‌‌‌‌క్ డిమాండ్ చేశారు. ఒకే దేశం ఒకే ఎలక్షన్, ఒకే రేషన్ విధానం అమలు చేస్తున్నప్పుడు... బంజారాల‌‌‌‌‌‌‌‌కు ‘వైనాట్‌‌‌‌‌‌‌‌.. వ‌‌‌‌‌‌‌‌న్ బంజారా’ రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని  కాన్ స్టిట్యూషన్ క్లబ్ వీపీ హౌస్ లో బంజారా ఉత్సవ్​ను చేప‌‌‌‌‌‌‌‌ట్టారు.

 ఇందులో బంజారాల సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన అంశాల‌‌‌‌‌‌‌‌పై ప్రముఖ బంజారా నేతలు చర్చించారు. వారి స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యల‌‌‌‌‌‌‌‌ను వెంట‌‌‌‌‌‌‌‌నే ప‌‌‌‌‌‌‌‌రిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. ఇందుకోసం గురువారం ఢిల్లీలోని జంత‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌ మంతర్ వద్ద ఢిల్లీ చ‌‌‌‌‌‌‌‌లో బంజారా.. వ‌‌‌‌‌‌‌‌జావో నంగ‌‌‌‌‌‌‌‌రాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆందోళనకు దేశ‌‌‌‌‌‌‌‌వ్యాప్తంగా గిరిజ‌‌‌‌‌‌‌‌న ప్రముఖులు హాజ‌‌‌‌‌‌‌‌రు కానున్నార‌‌‌‌‌‌‌‌ని చెప్పారు.