మోడీ ఆశయం అందరికీ ఒకే చట్టం : మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

మోడీ ఆశయం అందరికీ ఒకే చట్టం : మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి/ నిర్మల్‌‌‌‌, వెలుగుదేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశయమని, ప్రధాని ఆశయాన్ని ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని.. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు ఎవరికీ వ్యతిరేకం కాదని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రతిపక్షాలు మాత్రం సిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ సవరణ చట్టం(సీఏఏ)పై తమ లాభం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. నిర్మల్‌‌‌‌, పెద్దపల్లిలో సోమవారం బీజేపీ, జాతీయ వాదుల ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీల్లో బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, ఆపార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌‌‌‌రావు, దుగ్యాల ప్రదీప్​ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

 తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇండియా డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌లో దూసుకుపోతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వెనక్కి తీసుకెళ్లాలని కుట్ర పన్నుతున్నాయన్నారు. ఈ చట్టం పొరుగు దేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే వర్తిస్తుందని, మన దేశ ప్రజలకు వర్తించదని ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పినప్పటికీ అనవసరంగా ఆదోళనలు చేస్తున్నారని తెలిపారు. పౌరసత్వ చట్టం అన్ని దేశాల్లో ఉందని, మన దేశంలో ఎందుకు ఉండకూడదో చెప్పాలన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సీఏఏ చట్టానికి మద్దతుగా గ్రామ గ్రామాన ప్రచారం చేయాలన్నారు.  ఇప్పుడు ఎన్పీఆర్‌‌‌‌ను వ్యతిరేకిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ సమగ్ర కుటుంబ సర్వే చేసిన రోజు ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఒవైసీతో కలిసి మతవిభేదాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఆ దేశాల్లో తగ్గితే.. ఇక్కడ పెరిగారు

1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దానికి ముందు భారతదేశం అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిపి ఒకే దేశంగా ఉండేదని అన్నారు. 1930లో అఫ్గానిస్థాన్ వేరుకాగా స్వాతంత్రం వచ్చిన తరువాత పాకిస్తాన్​, బంగ్లాదేశ్ విడిపోయాయన్నారు. పాక్‌‌‌‌, బంగ్లా, అఫ్గాన్‌‌‌‌ విడిపోయినప్పుడు ఆయా దేశాల్లో 23 శాతం మంది హిందువులు ఉన్నారని, ఇండియాలో 8 శాతం మాత్రమే ముస్లిం మైనార్టీలు ఉండే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ దేశాల్లో హిందువులు 1.8 శాతానికి పడిపోగా భారతదేశంలో మైనార్టీల జనాభా 23శాతానికి పెరిగిందన్నారు. మన దేశంలో ముస్లిం మైనార్టీలను మంచిగా చూసుకుంటున్నామని, వారు కూడా స్వేచ్ఛగా ఉన్నారని అన్నారు.  సోయం బాపురావు మాట్లాడుతూ సీఏఏ ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను దక్కించుకునేందుకు కేసీఆర్, ఒవైసీతో కలిసి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఈ చట్టంతో మైనార్టీలకు ఎటువంటి అన్యాయం జరక్కపోయినా ప్రతిపక్షాలు కావాలని రెచ్చగొడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, పడకంటి రమాదేవి, కృష్ణాగోదావరి జలాల కన్వీనర్‍రావుల రాంనాథ్‍, కేంద్ర విత్తన పాలక మండలి సభ్యుడు అయ్యనగారి భూమయ్య, అంజుకుమార్‍రెడ్డి, సుహాసిని రెడ్డి దితరులు పాల్గొన్నారు .