తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర: వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర: వివేక్ వెంకటస్వామి

జైపాల్ రెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందన్నారు వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పారు. వెంకటస్వామితో కలిసి జైపాల్ రెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు వివేక్ వెంకటస్వామి. తెలంగాణ వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డికి సరైన గుర్తింపు రాలేదన్నారు.