
కరీంనగర్ లోని నీట్ పరీక్షకు మూడు నిమిషాలు ఆలస్యంగా రావడంతో వేములవాడకు చెందిన విద్యార్థిని వైష్ణవిని లోపలికి అనుమతించలేదు. విద్యార్థి తల్లి ఎంత బతిమిలాడినా అధికారులు లోపలికి రానివ్వలేదు. మంగళసూత్రం అమ్మి లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ఖర్చు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది వైష్ణవి తల్లి. కేవలం మూడు నిమిషాలే కదా క్షమించి పరీక్షకు అనుమతించాలని ప్రాదేయపడింది వైష్ణవి, ఆమె తల్లి . అయినా లోపలికి పంపలేదు అధికారులు.
మరో వైపు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు JNTU కళాశాలలో ఆలస్యంగా వచ్చారని ఇద్దరు విద్యార్థులను లోపలికి రానివ్వలేదు అధికారులు. నిజామాబాద్ బోధన్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలో ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను ఎగ్జామ్ కు అనుమతించలేదు అధికారులు