60 చదరపు గజాల్లో కడితేనే ఇందిరమ్మ ఇండ్లకు బిల్లు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 60 చదరపు గజాల్లో కడితేనే  ఇందిరమ్మ ఇండ్లకు బిల్లు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 ఇందిరమ్మ ఇండ్లు 60 చదరపు గజాల్లో కడితేనే బిల్లు మంజూరవుతుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇల్లు మంజూరైన నెలలోపే నిర్మాణం ప్రారంభించాలన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ పై రివ్యూ నిర్వహించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎంపిక చేయాలని ఆదేశించారు.  డబుల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ది దారులను ఎంపిక చేస్తామన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఇల్లు మంజూరు చేయబోమన్నారు.

ALSO READ | పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందన్నారు వివేక్ వెంకటస్వామి.   కేసీఆర్  రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా  మార్చారని ఫైర్ అయ్యారు. చెన్నూర్ మండలంలోని సోమనపల్లి లో రూ. 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు ఎమ్మెల్యే వివేక్.