
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- సర్వే చేయాలని కలెక్టర్కు ఆదేశాలు
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి వరి, మామిడి, మిర్చి, ఇతర పంటలకు నష్టం జరగడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, అన్నివిధాలా ఆదుకుంటుందని తెలిపారు. దెబ్బతిన్న పంటలను గుర్తించేందుకు సర్వే చేయాలని శుక్రవారం మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ను ఆదేశించారు. కలెక్టర్సూచనలతో వ్యవసాయాధికారులు సర్వే పనులు మొదలుపెట్టారు.