RR vs KKR: 6 సిక్సర్లతో రెచ్చిపోయిన రస్సెల్.. రాజస్థాన్ ముందు బిగ్ టార్గెట్!

RR vs KKR: 6 సిక్సర్లతో రెచ్చిపోయిన రస్సెల్.. రాజస్థాన్ ముందు బిగ్ టార్గెట్!

ఐపీఎల్ 2025 లో డూ ఆర్ డై మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం (మే 4) రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్ లో తొలిసారి బ్యాటింగ్ లో రస్సెల్ (25 బంతుల్లో 57: 4 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోయాడు. అతనితో పాటు రఘువంశీ(44), గర్భాజ్(35), రహానే(30) రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సెల్ (57) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో యుద్ వీర్ సింగ్, తీక్షణ, పరాగ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు. 

 టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ కు రెండో ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. సిక్సర్, ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన నరైన్ (11) రెండో ఓవర్ చివరి బంతికి బౌల్డయ్యాడు. ఈ దశలో కేకేఆర్ ఇన్నింగ్స్ ను రహానే, గర్భాజ్ ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లే ఇద్దరూ బౌండరీల వర్షం కురిపించడంతో పవర్ ప్లే లో కేకేఆర్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి గుర్భాజ్(35) ఔటయ్యాడు. ఆతర్వాత రహానే, రఘువంశీ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. 

Also Read : పరువు పోగొట్టుకున్నారు

రహానే సింగిల్స్ కు పరిమితమైన రఘువంశీ బ్యాట్ ఝుళిపించాడు. 42 పరుగుల భాగస్వామ్యం తర్వాత రహానే (30) ఔటయ్యాడు. ఈ దశలో కేకేఆర్ స్కోర్ కాస్త మందగించింది. అయితే ఒక ప్రళయం వస్తుందని రాజస్థాన్ అప్పటివరకు ఊహించి ఉండరు. పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ విశ్వరూపం చూపించాడు. ప్రారంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడినా ఆ తర్వాత చెలరేగి ఆడాడు. తీక్షణ వేసిన 18 ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన రస్సెల్.. 19 ఓవర్లో సిక్సర్ కొట్టి 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో రింకూ సింగ్ (19) రెండు సిక్సర్లు బాదడంతో కేకేఆర్ 200 పరుగుల మార్క్ చేరుకుంది.