
హైటెక్ యుగంలో పిల్లలు.. చిచ్చర పిడుగుల్లా తయారవుతున్నారు. చిన్నారులే పెద్ద పెద్ద సాహసాలకు ఒడిగడుతున్నారు. పెద్దలు చేయలేని పనులను చిన్న చిన్న బుడతలు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. తాజాగా గోరఖ్ పూర్ లో ఓ చిన్నారి తల్ల కిందులుగా ( చేతులు కింద.. కాళ్లుపైన)చేతులతో 72 మెట్లను స్పీడుగా దిగింది. మెట్లు దిగేటప్పుడు కౌంట్ చేసింది. అంతేకాదు రోజూ ఆ బుడతది ఇలానే చేతులతొ మెట్లను దిగుతానని తెలిపింది. ఒక జనాలు ఊరుకుంటారా.. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోను మిథి అనే యూజర్ తన అధికారిక ఖాతా 'mithithefighter' లో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన 24 గంటల్లో 4.7 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు స్పందించారు. ఒకరు ఈ బుడతను జిమ్నాస్టిక్ పోటీలకు పంపిస్తే గోల్డ్మెడల్ సాధిస్తుందని రాశారు. మరొకరు ఓ మైగాడ్.. ఓ బిడ్డా దేవుడు నిన్ను దీవించును గాక అని రాశారు. ఇంకొకరు నీకు చాలా ప్రతిభ ఉంది.. కాని రిస్క్ తీసుకోవద్దు అని రాశారు.