వరలక్ష్మి జర్నీ ఇన్‌‌ స్పైర్ చేస్తుంది

వరలక్ష్మి జర్నీ ఇన్‌‌ స్పైర్ చేస్తుంది

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన  చిత్రం ‘సరస్వతి’.  తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌తో కలిసి ఆమె నిర్మించింది. మార్చి 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పూజా శరత్‌‌కుమార్ మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్.  మంచి సోషల్ మెసేజ్ ఉంది.  ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ ఇందులో చూస్తారు.  వరలక్ష్మి  చాలా పర్సనల్‌‌గా కనెక్ట్ అయిన కథ ఇది. అందుకే  ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. 

ప్రకాష్ రాజ్, ప్రియమణి లాంటి అద్భుతమైన ఆర్టిస్టులు ఇందులో  ఉన్నారు. ప్రతి క్యారెక్టర్‌‌‌‌కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాకేజ్ పటాక.  రెండు గంటల సినిమాని ఎంత గ్రిప్పింగ్‌‌గా  చేయాలో అంత అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దాం. తమన్ మ్యూజిక్‌‌తో  సర్‌‌‌‌ప్రైజ్ చేస్తారు. వరలక్ష్మికి ఇది చాలా ఎమోషనల్ అండ్ ప్రౌడ్ మూమెంట్. పరిశ్రమలో తన జర్నీ చాలా స్ఫూర్తిదాయకం. 

ఈటీవీ విన్ సపోర్ట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. బన్నీ వాస్ గారికి సినిమా నచ్చడంతో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇక మా సంస్థలో కొన్ని   స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం.  ఫైనల్ అవ్వగానే పూర్తి వివరాలు తెలియజేస్తాం’ అని అన్నారు.