‘పుష్ప-2’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న అల్లు అర్జున్.. ఆ తర్వాత నటించబోయే సినిమాల విషయంలోనూ క్రేజీ లైనప్‌ను ఇప్పటికే సిద్ధం చేశాడు. నెక్స్ట్ మూవీని తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.
ఇక ఆ తర్వాతి చిత్రం మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ డైరెక్షన్‌లో ఉండబోతోందని సమాచారం. ‘మిన్నల్ మురళి’ వంటి సూపర్ హీరో చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన బాసిల్.. మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలతో హీరోగానూ వరుస విజయాలు అందుకున్నాడు. తన డైరెక్షన్‌లో బన్నీ హీరోగా సినిమా ఉండబోతోందని గతంలోనూ వార్తలు వచ్చాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఓ భారీ బడ్జెట్ కథను వినిపించాడని, ఈ ప్రాజెక్ట్‌కు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీ టాక్.
రీసెంట్‌గా జరిగిన అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు మలయాళ ఇండస్ట్రీ నుంచి బాసిల్ జోసెఫ్ మాత్రమే హాజరవడంతో మళ్లీ ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా ఈ వేడుకకు హాజరవడంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనూ ఓ సినిమా ఉండబోతోందనే ప్రచారం ఊపందుకుంది.
