టెన్త్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన పేరెంట్స్ !

టెన్త్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన పేరెంట్స్ !

పదవ తరగతిలో ఫెయిల్ అయినందుకు విద్యార్థులు సూసైడ్ చేసుకున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం.. పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్న భయంతో సూసైడ్ చేసుకున్నోళ్ల గురించి కూడా విన్నాం. పరీక్షల్లో ఫెయిల్ అయితే.. పిల్లలు ఎంత బాధపడతారో.. అంతకంటే ఎక్కువ పేరెంట్స్ బాధపడటం సహజం. అయితే.. కర్ణాటకలో తమ కొడుకు పదవ తరగతిలో ఫెయిల్ అయినందుకు పేరెంట్స్ చేసిన పని తెలిస్తే కచ్చితంగా అవాక్కవుతారు. కొడుకు పదిలో ఫెయిల్ అయితే.. కనీసం తిట్టకుండా, ఏ మాత్రం నిరుత్సాహ పరచకపోగా.. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేశారు పేరెంట్స్. కర్ణాటకలోని బాగల్కొటే జిల్లాలో జరిగిన ఈ ఘటనకు చెందిన వివరాలిలా ఉన్నాయి..

కర్ణాటకలోని బాగల్కోటె జిల్లా నవనగరకి చెందిన అభిషేక్‌ పదో తరగతి పరీక్షల్లో అన్ని సబ్జక్ట్స్ లో ఫెయిలయ్యాడు. అన్ని సబ్జెక్టులూ కలిపి 625కు 200 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో తన ఫ్రెండ్స్ కొందరు అభిషేక్‌ను హేళన చేశారు. ఫ్రెండ్స్ మాటలకు అభిషేక్ డీలా పడ్డాడు. కొడుకు పరిస్థితిని గమనించిన పేరెంట్స్ ఏమాత్రం ఆలోచించకుండా.. కేక్‌ కట్‌ చేసి సెలెబ్రేట్ చేశారు. పదో తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చని, ఫెయిలైనంత మాత్రాన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని అభిషేక్ కి దైర్యం చెప్పారు పేరెంట్స్.. 

ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ పేరెంట్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి అంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపై శ్రద్దగా చదివి పరీక్షల్లో పాస్ అవుతానని అంటున్నాడు అభిషేక్.