- ప్రతిఘటించిన బీజేపీ నేతలు
- ఉధ్రిక్తంగా మారిన నల్లగొండ
- కేంద్ర సంస్థలతో గాంధీ కుటుంబాన్ని వేధించే కుట
- నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత
నల్గొండ, వెలుగు : బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై పెట్టిన ఈడీ కేసులను కొట్టివేసి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం బీజేపీ జిల్లా కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. కోడిగుడ్లను విసిరేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల పైకి వచ్చేందుకు చూడగా పోలీసులు వారిని బీజేపీ ఆఫీస్నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అరగంటకు ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. నల్లగొండ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా నల్లగొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను వేధించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ ధోరణిని కోర్టు తప్పు పట్టిందన్నారు. గాంధీ కుటుంబ గౌరవం తగ్గించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను అణిచి వేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశ సంపదను అంబానీ, ఆదానీలకు ధారాదత్తం చేస్తున్న మోదీ కుట్రలను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
గాడ్సే సిద్ధాంతాలను అనుసరిస్తున్న బీజేపీకి కాలం చెల్లిందని, గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న రాహుల్ గాంధీ 2029లో ప్రధాని అవుతాడని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి, సేవా దళ్ చైర్మన్ సాగర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మరల చంద్రారెడ్డి, కాషిరెడ్డి నరేశ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, చిరూమర్రి కృష్ణయ్య, కన్నారావు, పోకల దేవదాసు, గాజుల శ్రీనివాస్ చిలుకూరి బాలు, ముంతాజ్ అలీ, ఆరిఫ్, మల్లేశ్‌గౌడ్, పారిజాత సుజాత, నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనారు.
సూర్యాపేటలో..
రాహుల్ గాంధీపై కక్షపూరిత కేసులు బనాయిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే నేషనల్‌హెరాల్డ్‌కేసులో సోనియా గాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ తప్పుడు కేసు నమోదు చేసినట్టు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రికలో తాము పెట్టుబడులు పెడితే మనీలాండరింగ్‌ఎలా అవుతుందని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్ల అమలు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంతో కాంగ్రెస్, రాహుల్‌గాంధీకి వచ్చిన ప్రజాదరణ చూసి తట్టుకోలేకే ఈడీ కాంగ్రెస్ అగ్రనేతలపై కేసులు నమోదు చేయించి డైవర్షన్‌పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఆఫీస్నుంచి బీజేపీ ఆఫీస్‌కు బైక్‌ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు,పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అనురాధ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, ధరావత్ వీరన్న నాయక్, తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి,వేములకొండ పద్మ, దివ్య, కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, కొండపల్లి దిలీప్ రెడ్డి పాల్గొన్నారు.
