మజగావ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 05.
పోస్టుల సంఖ్య: 200.
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 110, డిప్లొమా అప్రెంటీస్ 30, హిప్ బిల్డింగ్ టెక్నాలజీ లేదా ఇంజినీరింగ్ / నేవల్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ (బీఎస్‌డబ్ల్యూ) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 60.
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ ఇంజినీరింగ్/ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 16.
లాస్ట్ డేట్: 2026, జనవరి 05.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు mazagondock.in
వెబ్‌సైట్‌ను సందర్శించండి.
