యాదాద్రి, వెలుగు: పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు రూ.14 కోట్లు విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్సింగ్కు వినతిపత్రం అందించారు. పోచంపల్లి ఇక్కత్ హ్యాడ్యూమ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఈ నిధులు విడుదల చేయాలని కోరారు. బ్యాంకు రుణాలు పేరుకొనిపోయి హ్యాండ్లూమ్పార్క్ వేలానికి వెళ్లిందన్నారు.
ఈ పార్కును తిరిగి కొనుగోలు చేసి పునరుద్ధరించేందుకు తెలంగాణ సర్కారు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి బకాయిగా ఉన్న నిధులు విడుదల చేయాలన్నారు. పోచంపల్లి వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, ఈ నిధులు విడుదల చేస్తే పార్క్ పునరుద్ధరణతో చేనేత కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని ఎంపీ తెలిపారు.
