- జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి
యాదాద్రి, వెలుగు : మొబైల్యాప్ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో యాప్‌పై అధికారులు, డీలర్లతో మాట్లాడుతూ ఈనెల 20 నుంచి యాప్అమల్లోకి వస్తుందని, జిల్లాలోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ నుంచి యూరియాను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. యాప్‌ద్వారా యూరియా కొరత ఉందా, లేదా, ఎంత స్టాక్ ఉంది.. అన్న వివరాలు తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు, డీలర్లు పాల్గొన్నారు.
