
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. మహేశ్ ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డులో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది.