లండన్‪లో ఇండియన్ స్టూడెంట్ మృతి సంతాపం తెలిపిన నీతీ అయోగ్ మాజీ సీఈఓ

లండన్‪లో ఇండియన్ స్టూడెంట్ మృతి సంతాపం తెలిపిన నీతీ అయోగ్ మాజీ సీఈఓ

అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ మరణాలు రోజురోజుకు కలవరపెడుతున్నాయి. ఇటీవలే అమెరికాలో  విద్యార్థులపై వరుస దాడులు, హత్యలు జరిగాయి. మార్చి 19న లండన్ లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో పీహెచ్డీ స్టూడెంట్, మాజీ నీతి ఆయోగ్ ఉద్యోగురాలు చేష్టా కొచ్చర్ చనిపోయింది. హర్యానా గురుగ్రామ్‌కు చెందిన చేష్టా (33) గత సెప్టెంబర్‌లో పీహెచ్‌డీ కోసం లండన్‌ వెళ్లారు. గతంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో యూనివర్సిటీలో చదువుకున్నారు. అక్కడ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు.  చేష్టా సెంట్రల్‌ లండన్‌లో రాత్రి సైకిల్‌పై ప్రయాణిస్తోంది. ఈక్రమంలో ఓ ట్రక్కు ఆమెను ఢికొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ కూతురైయిన ఈమె 2021-23 మధ్యకాలంలో నీతీ అయోగ్ లో పని చేసింది. ఈ నేపథ్యలో చేష్టా మృతిపై నీతీ అయోగ్ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్ స్పందించారు. ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదం చేష్టా కుటుంబంలో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చాలా తెలివైదని, ధైర్యవంతురాలని నాతో కలిసి నడ్జ్ యూనిట్ లో పనిచేసిందని నీతీ అయోగ్ మాజీ సీఈఓ అన్నారు. చాలా త్వరాగా మన మధ్యనుంచి వెళ్లిపోవడం బాధాకరమని అమితాబ్ కాంత్ అన్నారు. ఎక్స్ ఖాతాలో ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. కూతురి మరణవార్త   కొచ్చర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.