యూపీఐ లావాదేవీల చార్జీలు వద్దు.. కేంద్రానికి నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి

యూపీఐ లావాదేవీల చార్జీలు వద్దు.. కేంద్రానికి నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలను మరి కొన్నేండ్ల పాటు ఉచితంగానే కొనసాగించాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో నగదు- జీడీపీ నిష్పత్తి తగ్గుముఖం పట్టేంత వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఫ్రీగా లావాదేవీలు జరిగేలా చూడాలని సూచించారు. 

లావాదేవీ విలువతో సంబంధం లేకుండా వ్యాపారులపై రుసుములు విధించడాన్ని తాను సమర్థించబోనని ఆయన స్పష్టం చేశారు. ఏ చిన్నపాటి రుసుము విధించినా, ప్రజలు మళ్లీ నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని, అది తిరోగమన చర్య అవుతుందని హెచ్చరించారు.