ఆస్పత్రిలో చేరిన ప్రతిభా పాటిల్

ఆస్పత్రిలో చేరిన  ప్రతిభా పాటిల్

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌  అస్వస్థతకు గురయ్యారు.   మార్చి 14న  రాత్రి పుణెలోని భారతీ హాస్పిటల్‌లో  ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతిలో ఇన్ ఫెక్షన్ తో భాదపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు  పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

 భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.  2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు. ఆమె భర్త  దేవీసింగ్ షెకావత్ 2023 ఫిబ్రవరిలో  గుండెపోటుతో మరణించారు.