
అవినీతి కేసులో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘ్‌ష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దాదాపు 15 రోజులుగా ఘోష్‌ను విచారించిన సీబీఐ అధికారులు సోమవారం(సెప్టెంబర్ 02) అరెస్ట్ చేశారు.
ఫిబ్రవరి 2021 -సెప్టెంబర్ 2023 మధ్య RG కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సందీప్ ఘోష్ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. క్లెయిమ్ చేయని మృతదేహాలను అక్రమంగా విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాల అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థులను లంచాల కోసం ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి.
Also Read :- స్వాతి మలివాల్‌పై దాడి కేసు
డాక్టర్ సందీప్ ఘోష్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించిన తర్వాత, జాతీయ దర్యాప్తు సంస్థ ఘోష్‌పై అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కాగా, డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన మూడు రోజులకు ఆగస్టు 12న ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు.
ఒకే మాట
ఈ కేసులో సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురు వైద్యులకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్టులు(అబద్ధం గుర్తించే పరీక్ష) నిర్వహించింది. ఈ పరీక్షల్లో సందీప్ ఘోష్ ఒకే మాట మీద ఉన్నారు. రెండుసార్లు పాలిగ్రాఫ్ టెస్ట్‌లు చేసినా ఒకే విషయాన్ని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ట్రైనీ డాక్టర్ మరణించిన విషయం తనకు ఆగస్టు 9న ఉదయం సుమారు 10.20 గంటల ప్రాంతంలో తెలిసిందని ఆయన చెప్పినట్టు తెలిపారు.