సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

సిద్ధూకు ఏడాది జైలు శిక్ష
  • 1988 నాటి కేసులో సిద్ధూకు జైలు శిక్ష
  • గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి పై సిద్ధూ దాడి .... తీవ్ర గాయలతో గుర్నామ్ సింగ్ మృతి 
  • సిద్ధూపై కేసు పెట్టిన గుర్నామ్ కుటుంబ సభ్యులు
  • సుదీర్ఘకాలం పాటు సాగిన కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు

న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 34 ఏళ్ల కిందట గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేసి... అతడి చావుకు కారణమైనందుకు సిద్ధూకు ఈ శిక్ష విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే... 1988లో పాటియాలాలో కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో సిద్ధూ, అతడి అనుచరుడు రూపీందర్ సింగ్ సంధు గొడవ పడి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్ర గాయలపాలైన గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గుర్నామ్ సింగ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 1999లో ఈ కేసు విచారించిన పాటియాలా సెషన్స్ కోర్టు... సాక్ష్యాలు లేవంటూ సిద్ధూ, అతడి అనుచరుడిని నిర్దోషులుగా ప్రకటించింది. 

అయితే ఈ తీర్పును మృతుడి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. 2006లో ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్షవిధిస్తూ  తీర్పును వెలువరించింది. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం కొనసాగిన ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు... ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే.. తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసుకునే వెసులుబాటును సిద్ధూకు కల్పించింది.

మరిన్ని వార్తల కోసం...

సర్కార్ చిల్లర బుద్ధి చూడలేకే గ్రామాలకు నేరుగా నిధులు

సీఎం దత్తత గ్రామంలోనూ ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తారల తళుకులు