
జైపూర్: ముంబై పేలుళ్ల సమయంలో ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులతో పోరాడిన ఆ సోల్జర్ కు జనం జేజేలు పలికారు. హీరోగా కీర్తించారు. అదే సోల్జర్ ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్ కేసులో పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. తాజ్ హోటల్‌లో (26/11)పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోరాడిన మాజీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండో బజరంగ్ సింగ్(45)ను రాజస్తాన్ పోలీసులు తాజాగా గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. అతని నుంచి 200 కేజీల గంజాయితోసహా పెద్ద మొత్తంలో డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజస్తాన్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), యాంటీ-నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏఎన్టీఎఫ్) బృందాలు..రతన్గఢ్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బజరంగ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.