కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

గురుగ్రామ్‌ : కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత, జేడీయూ మాజీ అధ్యక్షులు శరద్‌ యాదవ్‌(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్‌ వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్‌ యాదవ్‌.. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం(12వ తేదీ) రాత్రి తుదిశ్వాస విడిచారు. 

శరద్‌ యాదవ్‌.. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లాలో 1947 జులై 1న జన్మించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ ప్రభుత్వంలో శరద్‌ యాదవ్‌ కేంద్ర మంత్రిగా పలు శాఖల్లో పనిచేశారు. 2003లో జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. శరద్‌ యాదవ్‌ ఏడు సార్లు లోక్‌ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.