T20 World Cup 2024: ముంబై to USA.. అమెరికా బయలుదేరిన భారత క్రికెటర్లు

T20 World Cup 2024: ముంబై to USA.. అమెరికా బయలుదేరిన భారత క్రికెటర్లు

టీ20 ప్రపంచ కప్ 2024 లో తలపడే భారత క్రికెట్ బృదం అమెరికా బయలుదేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహా పలువురు ప్లేయర్లు, సిబ్బంది కొద్దిసేపటి క్రితమే ముంబైలోని ఛత్రపతి శివాజి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరు ప్రయాణించాల్సిన విమానం కాసేపట్లో గాలిలోకి ఎగరనుంది. 

టీ20 ప్రపంచ కప్ పోరుకు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీ జూన్ 2న ప్రారంభమై జూన్ 29న ముగియనుంది. ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. జూన్ 9న దాయాది దేశం పాకిస్థాన్‌‌తో తలపడనుంది. కాగా, ప్రాక్టీస్‌లో భాగంగా మే 31న భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది.

టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

స్టాండ్ బై ప్లేయర్స్: శుభ్ మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.