ట్రంప్ ను బ్లాక్ బెల్ట్ తో సత్కరించిన సౌత్ కొరియా

ట్రంప్ ను బ్లాక్ బెల్ట్ తో సత్కరించిన సౌత్ కొరియా

వాషింగ్టన్ డీసీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ కొరియా దిగ్గజ మార్షల్ ఆర్ట్స్ సంస్థ కక్కివొన్.. ట్రంప్ ను 9వ ర్యాంక్ బ్లాక్ బెల్ట్ తో సత్కరించింది. ఈ సంస్థ అధ్యక్షుడు లీ డాంగ్ సియోప్.. ఫ్లోరియాలోని ట్రంప్ ఇంటికి వెళ్లి ఆయనకు అవార్డును అందజేశారు. ట్రంప్ కు తైక్వాండోపై ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని డాంగ్ సియోప్ చెప్పారు. బ్లాక్ బెల్ట్ అందుకోవడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం దక్కడం సంతోషంగా ఉందని.. సెల్ఫ్ డిఫెన్స్ కు తైక్వాండో గొప్ప మార్షల్ ఆర్ట్స్ అని ప్రశంసించారు. భవిష్యత్తులో మళ్లీ యూఎస్ అధ్యక్షుడినైతే ఈ బ్లాక్ బెల్ట్ ధరించి శాసనసభకు హాజరవుతానని పేర్కొన్నారు. ఇకపోతే, ట్రంప్ కంటే ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను దక్షిణ కొరియా బ్లాక్ బెల్టుతో సత్కరించింది.