
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అరెస్టయ్యారు. పోర్న్ స్టార్ తో తన సంబంధాన్ని దాచేందుకు డబ్బులు చెల్లించారని, ఆ చెల్లింపుల విషయం బయటకు రాకుండా ఫోర్జరీ పత్రాలను సృష్టించారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మాన్ హట్టన్ కోర్టు కిందటి వారం ట్రంప్ పై నేరాభియోగాలను నిర్ధారించింది. దీంతో అమెరికా చరిత్రలో క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. మంగళవారం తనను అరెస్టు చేస్తారని ట్రంప్ కూడా సోషల్ మీడియాలో ముందే వెల్లడించారు.