వాటర్ బోర్డుకు రూ. 1,764 కోట్లు బకాయి వెంటనే చెల్లించాలి

వాటర్ బోర్డుకు రూ. 1,764 కోట్లు బకాయి వెంటనే చెల్లించాలి
  • వెంటనే చెల్లించేలా ఆదేశాలివ్వాలని సీఎంకు ఎఫ్ జీజీ లేఖ


హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖల నుంచి జలమండలికి పెద్ద ఎత్తున కన్సర్వెన్సీ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి వెల్లడించారు. వాట‌‌ర్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాల‌‌యాల నుంచి రూ. 1764.18 కోట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ. 250.23 కోట్లు రావాల్సి ఉందని..ఈ బకాయిలను వెంటనే చెల్లించేలా ఆయా శాఖలను ఆదేశాలించాలని సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం లెటర్ రాశారు. విద్యా శాఖ రూ. 19.02 కోట్లు, హెల్త్ శాఖ రూ.109.69 కోట్లు,  హోమ్ శాఖ రూ. 40.86 కోట్లు, హౌసింగ్ శాఖ రూ. 57.55 కోట్లు, ఇండస్ర్టీస్ శాఖ రూ. 24.96 కోట్లు, మున్సిపల్ శాఖ రూ.33.05 కోట్లు, మిషన్ భగీరథ నుంచి రూ. 1011.29 కోట్లు, పంచాయతీ రాజ్ రూ. 377.29 కోట్లు, ఆర్ అండ్ బీ నుంచి రూ.17.71 కోట్లు బకాయిలు ఉన్నాయని లేఖలో వివరించారు.