- నలుగురు అరెస్ట్.. పరారీలో ఏ1
మెహిదీపట్నం, వెలుగు: రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనిల్ కుమార్ నోనియా, గౌరవ్ నోనియా, ఝార్ఖండ్‌కు చెందిన పరన్ కుమార్, దేవ్ కుమార్ కలిసి నగరంలో వివిధ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు కొట్టేసి పారిపోయేవారు. విశ్వాసనీయ సమాచారంతో మెహిదీపట్నం సీఐ ఎస్. మల్లేశ్, డీఐ రాంబాబు నేతృత్వంలో క్రైమ్ టీమ్ పోలీసులు వీరిని పట్టుకున్నారు.
దాదాపు రూ.6 లక్షల విలువైన 21 సెల్ఫోన్లను రికవరీ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సాగర్ కుమార్ నోనియా ప్రతిరోజు రూ.వెయ్యి ఇచ్చి రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు కొట్టేసి తీసుకురావాలని వీరికి హుకుం జారీ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.
